నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో శనివారం మొబైల్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఇంటింటికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టి వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చూస్తున్నామని శ్రీకాంత్ చెప్పారు. ప్రజలందరూ సహకరించి స్పెషల్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్, లక్ష్మణ్, సుబధ్ర, రాములునాయక్, వెంకట్, స్వామి, రాజు, శివ స్థానిక నాయకులు, జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.