బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిని కలిసిన సింధురఘునాథ్ రెడ్డి – పార్టీ కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఖాయం: డికె‌ అరుణ

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర నాయకురాలు, చందానగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సింధూరఘునాథ్ రెడ్డి మంగళవారం‌ డీకే అరుణను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, యువతకు పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఓటమికి కృంగిపోకుండా ఓటమి విజయానికి నాందిలా‌ భావిస్తూ భవిష్యత్తులో దానిని పునాదిగా చేసుకొని ప్రజల సమస్యలపై పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పనితనాన్ని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. బిజెపి‌ పార్టీలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

డికె‌ అరుణను కలిసి సన్మానిస్తున్న సింధూరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here