నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఉషోదయ ఎన్ క్లేవ్ బీహెచ్ఈఎల్ హెచ్ఐజీ ఫేస్ 2 కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 6.70 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, ఎస్ఐ లు రవి కుమార్, రవి కిరణ్ , కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉషోదయ ఎన్ క్లేవ్ బీహెచ్ఈఎల్ హెచ్ఐజీ ఫేస్ 2 కాలనీ వాసులు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, అన్ని కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషిగా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా కోటి రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేస్తాయన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ కె వాంచు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఉషోదయ ఎన్ క్లేవ్ బీజెచ్ఈఎల్ హెచ్ఐజీ ఫేస్ 2 కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు , ఉపాధ్యక్షుడు పూర్ణచందర్ రావు , కార్యదర్శి నర్సింహా, ట్రెజరర్ నాగేశ్వర్ , డైరెక్టర్ శ్రీహరి రావు, డైరెక్టర్లు సత్తిరాజు, బాలాజీ నాయక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.