నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం చెరువు వద్ద ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు కోసం శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మంజూరైన ఏడు మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణము లో భాగంగా డివిజన్ల వారీగా ఎస్టీపీ ప్లాంట్ల కోసం స్థలాలను పరిశీలిస్తున్నామని అన్నారు. స్థల పరిశీలన పూర్తి కాగానే త్వరితగతిన పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం చెరువు వద్ద రూ. 64.14 కోట్ల అంచనావ్యయం తో 20 ఎం ఎల్ డీ సామర్థ్యం గల ఎస్టీపీ ని నిర్మించడం జరుగుతుందన్నారు. మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు ఉన్నారు.