ఎంఏ నగర్ లో మొబైల్ వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ లో చేపట్టిన కరోనా మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని ఉప్పలపాటి శ్రీకాంత్ సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ గురించి జిహెచ్ఎంసి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. కరోనా నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాస్కులు తప్పకుండా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు గౌడ్, శివ ముదిరాజ్, మహిళ నాయకురాలు వాణి,ఎస్ ఆర్ పీ కనకరాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎంఏ నగర్ లో చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ ను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here