నమస్తే శేరిలింగంపల్లి: రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 30 మంది పోలీస్ సిబ్బంది, పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పిలుపు మేరకు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా ఉదృతి నేపథ్యంలో బ్లడ్ బ్యాంక్‌లలో రక్త నిల్వలు పడిపోయాయని, ఈ క్రమంలో రక్తం అవసరమైన వారు చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రక్తదాన శిబిరాలతో అలాంటి వారికి ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు.