బాలాజి న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన మియాపూర్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలలో మౌలికవసతుల‌ కల్పనకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ ‌గాంధీ సహకారంతో కృషి చేస్తానని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానికులతో కలసి పాదయాత్ర నిర్వహించారు. కాగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్డు సమస్యల తీవ్ర‌త‌ను స్థానికులు కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ ప్రాధాన్య‌తా క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌న్నింటిని పరిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకురాలు లావణ్య, ప్రణీత్ కుమార్, సుధీర్ కుమార్, రవి, సత్యనారాయణ, మహాదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ నగర్ లో సమస్యలు తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here