నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలో టీఎన్జీఓ కాలనీలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలను నాటడం జరుగుతుందని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ , ఏఎంహెచ్ఓ రవి కుమార్ , శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, జంగయ్య యాదవ్, సురేందర్, రమేష్,రాజు ముదిరాజు , అనిల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.