నమస్తే శేరిలింగంపల్లి: భారీ వర్షాల కారణంగా వరద ముంపు ప్రాంతాల్లో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గురువారం పర్యటించారు. చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ కాలనిలో వర్షానికి రోడ్లు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గారు పరిశీలించి రోడ్ల పై ఉన్న వరద నీటిని, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. మాన్ సూన్ టీం ద్వారా కాలనీలలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలనీ రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. డివిజన్ పరిధిలో కాలనీలో వరద ముంపునకు గురికాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్ స్పెక్టర్ హరీష్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.