నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖానామెట్ భూములను వేలం పాట ద్వారా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం దారుణమని బీజేపీ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు గంగాల రాధాకృష్ణ యాదవ్ వాపోయారు. ఇజ్జత్ నగర్ కాలనీవాసుల కోసం ఉన్న హిందూ స్మశాన వాటిక స్థలం ఖానామెట్ సర్వేనెంబర్ 41/14 ప్లాట్ నం. 17 లో గలదన్నారు. వేలం పాట వేయకూడదని ప్రజల పక్షాన నిలబడితే పోలీసులు రెండు రోజులుగా హౌజ్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు యం. రవికుమార్ యాదవ్ సహకారంతో బొందల గడ్డను వేలం పాట వేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల తో కలిసి ఉద్యమం చేసి న్యాయ పోరాటం తో స్మశాన వాటికను వేలం వేయకుండా బొందల గడ్డను యధావిధిగా ఉండేటట్లు కృషి చేసిన బీజేపీ నాయకులకు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండో రోజు హౌస్ అరెస్టు అయిన వారిలో బీజేపీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు గంగాల నర్సింహయాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మదనాచారి, సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, గురుస్వామి, నరేష్, మహిళా నాయకులు శిరీషా రెడ్ది, భారతి, చంద్రకళ, బాలమ్మ, అనురాధ కాలనీ వాసులు ఉన్నారు.