నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో అన్ని కమిటీలను పూర్తి చేసి, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలను వేసుకుని బిజెపి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పేర్కొన్నారు. తారానగర్ లో నిర్వహించిన చందానగర్ డివిజన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థాగతంగా పార్టీ పటిష్ఠవంతమైతే భవిష్యత్తు ఎన్నికల్లో విజయం సాధ్యమని ఆయన అన్నారు. బిజెపిలో చేరిన సైంటిస్ట్, విద్యావేత్త సత్యరమేష్ ను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, బిజెపి చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి, డివిజన్ ఇంచార్జి కన్నా గౌడ్, పోరెడ్డి బుచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. త్రినాథ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాకేష్ దూబే, శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శులు శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు పగడాల వేణుగోపాల్, లలిత, శోభా దూబే, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.