నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. వర్షానికి వరద నీరు రావటం తో జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేసి వర్షపునీటిని తొలిగించారు. వచ్చే మూడు రోజులు వర్షాలు ఉండటంతో తగిమ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, లింగంపల్లి గ్రామ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, గఫ్ఫూర్, జయంత్ కుమార్, అశోక్, ముభాషిర్, నర్సింగరావు, అబ్దుల్లా, దేవుకుమార్, ఆలిం,గోపాల్ యాదవ్,శ్రీకాంత్ యాదవ్,శ్రీకాంత్, సుమన్, ఎస్ ఆర్ పి భరత్, జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.