నమస్తే శేరిలింగంపల్లి:
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు బాసటగా నిలుస్తామని, ప్రభుత్వం తరపున సీఎం సహాయ నిధి అందజేసి ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ భరోసా ఇచ్చారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట ప్రాంతానికి చెందిన ఫరాన అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధ పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ ఆదివారం స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. శస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని హామీనిచ్చారు. స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి స్పందించి తక్షణ సహాయం కింద రూ. 25 వేల నగదును బాధితురాలు ఫరానాకు అందజేశారు. కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్ తో పాటు చందానగర్, మాదాపూర్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,నాయకులు అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.