నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలంలో అపరిశుభ్రత కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవ్వకుండా ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం పట్టణ ప్రగతి అని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం డివిజన్ పరిధిలోని శాంతినగర్, రాజీవ్ నగర్‌లలో ఆమె మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పూజిత జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ అపరిశుభ్ర వాతావరణం కారణంగా కలరా, డయేరియా వంటి వ్యాధులతో పాటు దోమలు వృద్ది చెంది మలేరియా, టైఫాయిడ్ రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా ఉంచేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ శ్రీమతి. శ్రీకాంతి , డి.ఈ శ్రీ.సురేష్, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి మేనేజర్ సుబ్రమణ్యం, ఏ.ఈ ధీరజ్ , శానిటేషన్ ఎస్.అర్.పి గంగా రెడ్డి, నాయకులు సుధాకర్, ఎస్.యాదయ్య, ఆర్.చంద్రయ్య, సాదీక్, అంజయ్య, కృష్ణ, లక్ష్మణ్ రావు, అఫ్సర్, హనీఫ్, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, హరీష్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కలీల్ తదితరులు పాల్గొన్నారు.