ఆభాగ్యుల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆప‌న్న‌హ‌స్తం: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం ముఖ్య మంత్రి సహాయ నిధి ధ‌ర‌ఖాస్తు చేసుకోగా రూ.5.50 ల‌క్ష‌లు మంజూర‌య్యాయి. స‌ద‌రు ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను గురువారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ ఆరుగురు ల‌బ్ధిదారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అని అన్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోను ముఖ్య‌మంత్రి స‌హాయనిధి పంపిణీలో ఎక్క‌డ జాప్యం లేద‌ని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందనిపేర్కొన్నారు. క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతున్న‌ప్ప‌టికి, లాక్‌డౌన్ వ‌ల్ల ఆర్ధిక వ్య‌వ‌స్థ కుదేల‌వుతున్నా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద‌మొత్తంలో నిధులు మంజురు చేస్తున్న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చంద్రారెడ్డి, సాంబశివరావు, సురేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ల‌బ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ

సీఎంఆర్ఎఫ్ ల‌బ్ధిదారులు వీరే…
1) కూకట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ కి చెందిన ప్రశాంత్ కి 2,00,000/- (LOC)
2) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డోయన్స్ టౌన్ షిప్ కాలనీ కి చెందిన సత్యనారాయణ కి 1,25,000/-
3) కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీ కి చెందిన ఖలీమ్ ఖాన్ కి 60,000/-
4) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన SK పాషా కి 60,000/-
5) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ కి చెందిన మార్కండేయ కి 55,000/-
6) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కి చెందిన శ్రీలత కి – 49,500/-

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here