- గచ్చిబౌలి, మియాపూర్ డివిజన్‌లలో కొత్తగా వ్యాక్సినేషన్ సెంటర్ల ప్రారంభం
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగుడలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లను కార్పొరేటర్లు గాంగాధర్‌రెడ్డి, ఉపకమిషనర్ వెంకన్న, ఏఎంఓహెచ్ మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం ప్రారంభించారు. ఈ అదేవిధంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీనగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలసి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సకాలంలో వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచాలని మంత్రి కేటీఆర్, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌లకు వినతిపత్రం అందించడం జరిగిందని, ఈ క్రమంలోనే శేరిలింగంపల్లిలో వ్యాక్సిన్ సెంటర్లను పెంచడం జరిగినది అని అన్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో శేరిలింగంపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సంధ్య కన్వెన్షన్, మజీద్ బండ కమ్యూనిటీ హాల్, కాజాగుడా స్పోర్ట్స్ కాంప్లెక్స్, చందానగర్ సర్కిల్ పరిధిలో హఫీజ్‌పేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, పీజేఆర్ స్టేడియం, అంబెడ్కర్ మున్సిపల్ కళ్యాణమండపం, జేపీ నగర్ కమ్యూనిటీ హాల్, అయ్యప్ప సొసైటీ కాలనీ కల్చరల్ క్లబ్ కమ్యూనిటీ హాల్‌లలో వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగందని అన్నారు. ఈ చక్కటి సదావకాశాన్ని ప్రజలందరు సద్వినియోగపర్చుకోవలని, ప్రతి ఒక్కరు టీకా తప్పనిసరిగా వేసుకోవాలని గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రాజునాయక్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు చెన్నం రాజు, నరేష్, సత్యనారాయణ, జంగయ్య యాదవ్, సురేందర్ వినోద్,మల్లేష్,రమేష్,జగదీష్,యాదగిరి, రాజుముదిరాజు, విజయలక్ష్మి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్ , రాము, మల్లేష్, అన్నే రాజు తదితరులు పాల్గొన్నారు.