నమస్తే శేరిలింగంపల్లి: ఇజ్జత్‌నగర్ వీకర్‌సెక్షన్ స్మశానవాటిక స్థలం వేయడాన్ని సీపీఐ శేరిలింగంపల్లి కమిటి తీవ్రంగ ఖండించింది. శ్మశానవాటికలో టీఎస్ఐఐసీ ఏర్పాటు చేసిన బోర్డు ముందు సీపీఐ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శేరిలింగంపల్లి సంయుక్త కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్‌లో 10 వేలకు పైగా జనాభా ఉంటుందని, గత రెండు దశాబ్ధాలుగా బస్తీలో ఎవరు మృతిచెందిన స్థానిక స్మశాన వాటికలోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాంటి స్థలాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెలం నుంచి స్మశాన వాటిక స్థలానికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కే నరసింహారెడ్డి, ఇజ్జత్ నగర్ కార్యదర్శి ఖాసిమ్, ఏఐటియుసి శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కే చందు యాదవ్, సిపిఐ విద్యుత్ నగర్ సీనియర్ నాయకులు ఎస్ నారాయణ, కొండల్ తదితరులు పాల్గొన్నారు.