నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పాఎన్‌క్లేవ్‌లోని విశాఖ శారదా పీఠపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం ప్రాంగణంలో 327 ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మ వెంకటేశ్వర్లు మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ల క్రితం ఆలయ ప్రారంభోత్సవం నాడు చందానగర్ వెంకటేశ్వరాలయ ప్రధానార్చకులు, విశాఖ శారదాపీఠం రాష్ట్ర ఆగమ సలహదారు సుదర్శనం సత్యసాయితో కలసి పవిత్రమైన బిల్వ పత్రి మొక్కను నాటడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత ఆనవాయితీ ప్రతియేడు ఒక్కో మొక్కను నాటడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఇతర సమయాల్లోను ఇతర మొక్కలను నాటామని తెలిపారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన జమ్మి చెట్టు, మామిడి, జామ, అరటి, ఉసిరి, అల్లనేరేడు, దానిమ్మ, మారేడు, మర్రి, చింత, మోదుగు, ఏకబిల్వ, రావి చెట్టు నాటటం జరిగిందని, తాజాగా రావిచెట్టుకు అనుసంధానంగా వేపమొక్కను నాటడం జరిగిందని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అందరు విరివిగా మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.