కాల‌నీలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి… కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటికి రెడ్డి ఎన్‌క్లేవ్ వాసుల విన‌తి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని రెడ్డి ఎన్‌క్లేవ్‌ వాసూలు ఆదివారం స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌లపాటి శ్రీకాంత్‌ను క‌లిశారు. కాల‌నీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ని ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ కార్పొరేట‌ర్‌కు విన‌తి పత్రం అంద‌జేశారు. ప్ర‌ధానంగా రోడ్లు, డ్రైనేజీ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ విప్ గాంధీ స‌హ‌కారంతో కాలనీలోని సమస్యల ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. విన‌తీ ప‌త్రం స‌మ‌ర్పించిన వారిలో రెడ్డి ఎన్‌క్లేవ్ కాల‌నీ సంక్షేమ సంఘం స‌భ్యులు, కాల‌నీ వాసులు ఉన్నారు.

కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న రెడ్డి ఎన్‌క్లేవ్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here