నేతాజీన‌గ‌ర్‌లో కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి బ‌స్తీబాట‌… ప్రాధాన్య‌తా క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి హామీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీన‌గ‌ర్‌లో శుక్ర‌వారం ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్ రెడ్డి బస్తీ బాట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. బ‌స్తీలోని ప్ర‌తి విధిలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తూ స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. నేతాజీన‌గ‌ర్‌లో ప్ర‌ధానంగా డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల ఏర్పాటు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌కు కాల‌నీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు భేరి రాంచంద‌ర్ యాద‌వ్ కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. సానుకూలంగా స్పందించిన గంగాధ‌ర్ రెడ్డి ప్రాధాన్యత క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్కార‌మ‌య్యేలా చూస్తాన‌ని హామి ఇచ్చారు. అనంత‌రం అధికారుల‌తో మాట్లాడి నేతాజీన‌గ‌ర్‌లోని స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని స్థానికులకు ఆయ‌న సూచించారు. అదేవిధంగా కరోన వ్యాధి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బస్తీబాట కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి గారు, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌ విశ్వనాధ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీఆర్‌పీ భరత్, నాయకులు, వినయ్, రాయుడు, బాలరాజు సాగర్, నరసింహ, చంద్రశేఖర్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సంతోష్, నరేష్, శ్రీనివాస్, చంద్రకళ, పుష్ప లత, పద్మ, జయ రెడ్డి, లక్ష్మి, ఇత‌ర బస్తి వాసులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డికి స్థానిక స‌మ‌స్య‌ల‌కు వివ‌రిస్తున్న నేతాజీన‌గ‌ర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here