నమస్తే శేరిలింగంపల్లి: లాక్‌డౌన్ నేపథ్యంలో రవికుమార్ యాదవ్(ఆర్‌కేవై) ఫ్రాణహేతు ఆద్వర్యంలో మసీదు బండ వడ్డెర బస్తిలో భోజనం పంపిణీ చేశారు. స్థానిక నిరుపేదలతో పాటు బీహార్ వలస కార్మికులకు జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు పెద్దమొత్తంలో టమాటా రైస్ బాక్సులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌కేవై టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రతిరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నిరుపేదలకు భోజనం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా నిత్యావసర సరుకులు, కరోనాతో బాద పడుతున్న వారికి ఆర్‌కేవై ప్రాణహేతు ఆద్వర్యంలో ఉచితంగా మందులు సైతం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌కేవై టీం సభ్యులు వినోద్ యాదవ్జా, జాజి రావు, రాము, చంద్ర మాసిరెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.