నమస్తే శేరిలింగంపల్లి: బిజేపి ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి సీనియర్ నాయకలు, గంగారం గ్రామానికి చెందిన ఏశం శ్రీశైలం యాదవ్ ఆదివారం రాత్రి మృతిచెందారు. పదిహేను రోజుల క్రితం కరోనా భారిన పడిన శ్రీశైలం యాదవ్ ను కుటుంబ సభ్యులు హైదర్ గూడ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కాగా లంగ్ ఇన్ఫెక్షన్ తో చితిత్స పొందుతున్న శ్రీశైలం యాదవ్ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాతంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. శ్రీశైలం యాదవ్ గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరిన శ్రీశైలం యాదవ్ కు ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం దక్కింది. శ్రీశైలం యాదవ్ ఆకాల మరణం పట్ల శేరిలింగంపల్లి లోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.