నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్‌నగర్‌లో జీహెచ్ఎంసీ సిబ్బంది బుదవారం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. బస్తీలో కోరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బస్తీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ ఆద్వర్యంలో అధికారులకు విజ్ఞప్తి చేయగా బస్తీలోని అన్ని వీధులలో కరోనా క్రిమి సంహారక మందులను పిచికారి చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఏఈ గణేష్, ఎస్ఆర్‌పీ కనకరాజులకు అనిల్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు రాజు ,మధు, సుల్తానా బేగం, జలీల్ మియా, నర్సింలు ,రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.