నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడం బాధాకరమని అన్నారు. వారు తిరిగి ప్రజాసేవలో ముందుకు సాగాలని నాగేందర్ యాదవ్ ఆకాంక్షించారు.