ప్ల‌వ‌నామ సంవ‌త్స‌రం ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను దూరం చేస్తుంది: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకుని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు, టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప్రత్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ల‌వ నామ సంవ‌త్స‌రం పేరుకు త‌గ్గట్టు ఈ ఏడాది ప్ర‌జ‌ల క‌ష్టాల‌న్ని దూరం చేస్తుంద‌ని ఆయ‌న ఆశాబావం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీకి అభినంద‌నలు వెళ్లువెత్తాయి. కార్పొరేట‌ర్లు ఉప్ప‌లపాటి శ్రీకాంత్‌, నార్నె శ్రీనివాస రావు, నల్లగండ్ల సోమేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మెన్ చెన్నం రాజు, స‌భ్యులు ఆకుల యాదగిరి, నరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ తెరాస నాయకులు రాగం అనిరుధ్ యాద‌వ్‌, బసవయ్య, వివేకానంద నగర్ డివిజన్ టీఆర్ఎస్‌ అధ్యక్షులు సంజీవ రెడ్డి, నాయకులు చంద్రమౌళి సాగర్, విద్యాసాగర్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సైదేశ్వర్ రావు, హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్ నాయ‌కుడు కోనేరు ప్ర‌సాద్ త‌దిత‌రులు గాంధీని క‌లిసి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌భుత్వ విప్ గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here