నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత దేవాలయాలైన అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని సాయిబాబా దేవాలయం, శిల్పా ఎన్‌క్లేవ్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయాల్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆనవాయితీ ప్రకారం ఇరు దేవాలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ సాయిబాబా దేవాలయంలో ఆలయ ఆస్థాన సిద్ధంతి ఎస్‌వీఎస్ ప్రసాద్, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో బ్రహ్మశ్రీ వేదుల పవన్‌కుమార్ శర్మలు పంచాంగ పఠనం చేశారు. పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ ఏడాది తమ పరిస్థితుల గురించి భక్తులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.