నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనీకుడు పూలే అని కొనియాడారు. కులవృత్తులకు సామాజిక, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించేలా వారు అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.