సాయి బృందావ‌న్‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఉచిత వైద్య శిబిరం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి పరిధిలోని సాయి బృందావన్ కాలనీ అసోసియేషన్ కార్యాలయంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్ ఆద్వ‌ర్యంలో ఉచిత వైద్య‌శిబిరం నిర్వ‌హించారు. మాదాపూర్ మెడిక‌వ‌ర్ హాస్పిటల్, మాక్స్ విజన్ ఐ హాస్పిటల్, క్లవ్ డెంటల్ వారి సౌజన్యంతో శ‌నివారం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఎత్తు, బరువు, బిపి, షుగర్, పల్స్ రేట్, ఈసీజీ, కంటి, దంత పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన‌సాగిన ఈ శిబిరాన్ని చందానగర్ ఇన్‌స్పెక్ట‌ర్‌ క్యాస్ట్రో రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయాయం, యోగ 40 నిమిషాలు చేయాలన్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు , గ్రుడ్లు, చేపలు మొదలగు ఆహార పదార్థాలను తీసుకోవాలని అన్నారు. ప్ర‌జ‌లు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో 110 మందికి పైగా పాల్గొని వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో సాయి బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవేంద్రరావు, నాయకులు ప్రణయ్, రవికుమార్, దిలీప్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, విష్ణుప్రసాద్, జనార్దన్, జిల్ మల్లేష్, నందకుమార్, రామ్మోహనరావు హాస్పిటల్ ప్రతినిధి సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 110 మందికి వైద్య సేవలు అందించారు.

శిబిరాన్ని ప్రారంభించిన ఇన్స్‌పెక్ట‌ర్ క్యాస్ట్రో రెడ్డికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here