ములాయం సింగ్‌యాద‌వ్ జీవితం నేటి రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆద‌ర్శం: భేరిరాంచంద‌ర్‌యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్‌యాద‌వ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందించిన మై ములాయం చిత్రం అంత‌ర్జాతీయ అవార్డులు అందుకుంద‌ని సామాజిక సేవ‌ర‌త్న పుర‌స్కార గ్ర‌హీత, జాతీయబీసీసంక్షేమ సంఘం తెలంగాణ ఉపాధ్యక్షులు, భేరిరాంచంద‌ర్‌యాద‌వ్ తెలిపారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో మై ములాయం పేరిట రూపొందించిన బ‌యోపిక్ ప్రివ్యూ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌సాద్‌ల్యాబ్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మీనా సేదీ మండల్, దర్శకుడు సువెన్ దు రాజ్ ఘోష్ , ములాయం పాత్రధారి అమిత్ సేదీ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సంద‌ర్భంగా చిత్రాన్ని ఉద్దేశించి భేరి రామచందర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మై ములాయం చిత్రం దేశంలోని ఉన్నతమైన విలువలు కలిగి ఉన్న రాజకీయం నాయకుడి కథ అని, నేటి యువ నాయకులకు ఈ చిత్రం ఒక మార్గదర్శకంగా నిలుస్తుంద‌ని తెలిపారు. సమాజంలో విలువలతో కూడిన రాజకీయం చేయాలని, ఈ చిత్రాన్ని తెలుగు భాషల్లో అనువదించి రెండు తెలుగు రాష్ట్రాలలో చిత్రాన్ని విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల చారి, దైవజ్ఞ శర్మ, బాబా రాందేవ్ ప్రియశిష్యుడు స్వామి రామకృష్ణగురూజీ, ప్రముఖ న్యాయవాది బిక్షపతి యాదవ్, గజల్ శ్రీనివాస్, ఎర్ర గుడ్ల ప్రభాకర్ యాదవ్, రాగం సతీష్ యాదవ్, బాడీ బిల్డర్ రాజు యాదవ్, రవి యాదవ్, చంద్ర శేఖర్యాదవ్,
లవన్ కుమార్ చారి, శివ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మై ములాయం చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లో సినీ యూనిట్ తో భేరిరాంచంద‌ర్‌యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here