క్రీడారంగంలో యువత మెరుగ్గా రాణించాలి: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని, యువ‌కులు ప్ర‌భుత్వ ప్రోత్సాహంతో క్రీడ‌ల్లో మెరుగ్గా రాణించాల‌ని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. మంగ‌ళ‌వారం మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని శిల్ప పార్క్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఇండోర్ బ్యాడ్మింట‌న్ కోర్డును గాంధీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజ్, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌తో క‌లిసి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పట్టణాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడా మైదానాల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్వరాష్ట్ర క్రీడాకారులకు ప్రాధాన్యం దక్కిందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్ శిల్పపార్క్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, స‌భ్యులు నవీన్, వినయ్, చంద్ర శేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

బ్యాడ్మింట‌న్ కోర్డు ప్రారంభోత్స‌వంలో ప్ర‌భుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్యే బాల‌రాజు, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here