నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిలకడగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:00 గంటలకు 20 శాతం వరకు నమోదైన పోలింగ్ శాతం 2 గంటల వరకు 38 శాతానికి చేరుకుంది. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో మొత్తం 12 పోలింగ్ స్టేషన్లలో కలిపి 38.49 ఓటింగ్ శాతం నమోదు కాగా చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మొత్తం 21 పోలింగ్ స్టేషన్లలో కలిపి 36.98 శాతం పోలింగ్ నమోదయింది. కాగా టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు ఎండి అన్వర్ షరీఫ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, వివేకానంద నగర్ డివిజన్ ఇన్చార్జ్ విద్యా కల్పనా ఏకాంత్ గౌడ్, చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గొప్ప నవత రెడ్డి తదితరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.