నిలకడగా కొనసాగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిలకడగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:00 గంటలకు 20 శాతం వరకు నమోదైన పోలింగ్ శాతం 2 గంటల వరకు 38 శాతానికి చేరుకుంది. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో మొత్తం 12 పోలింగ్ స్టేషన్లలో కలిపి 38.49 ఓటింగ్ శాతం నమోదు కాగా చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మొత్తం 21 పోలింగ్ స్టేషన్లలో కలిపి 36.98 శాతం పోలింగ్ నమోదయింది. కాగా టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు ఎండి అన్వర్ షరీఫ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, వివేకానంద నగర్ డివిజన్ ఇన్చార్జ్ విద్యా కల్పనా ఏకాంత్ గౌడ్, చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గొప్ప నవత రెడ్డి తదితరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శేరిలింగంపల్లి సర్కిల్  20 పరిధిలో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా నమోదైన ఓటింగ్ సరళి
చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా నమోదైన ఓటింగ్ సరళి
చందానగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఎం.డి అన్వర్ షరీఫ్
మియాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
చందానగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సురేష్ దంపతులు
వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ఇంచార్జ్ ఉప్పల విద్యా కల్పన ఏకాంత గౌడ్ తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న స్థానిక నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here