
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని స్థానిక కార్పొరేటర్ నవతరెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని చందానగర్ సర్వీస్ రోడ్ లో సి.సి ప్యాచ్ వర్క్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నవతరెడ్డి మాట్లాడుతూ చందానగర్ లో డ్రైనేజీ ఔట్ ఫ్లో సరిగా లేక కాలనీ వాసులు ఇబ్బంది పడుతుండటం తో కొత్త డ్రైనేజీ లైన్ వేయటం జరిగిందన్నారు. పనుల కారణంగా రోడ్ గుంతల మయంగా మరి వాహనదారులు ఇబ్బంది పడుతుండటంతో ప్యాచ్ వర్క్ పనులు చేయటం జరిగిందన్నారు. ప్యాచ్ వర్క్ పనులు త్వరగా పూర్తి చేసి వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆమె అధికారులకు సూచించారు.





