సుర‌భి వాణీదేవి‌ని పెద్ద‌ల స‌భ‌కు పంపిద్ధాం: రాగం సుజాత యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఉమ్మ‌డి రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవికి మ‌ద్ధ‌తుగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు చైర్‌ప‌ర్స‌న్‌ రాగం సుజాత నాగేంద‌ర్ యాద‌వ్ బుద‌వారం ప్ర‌చారం నిర్వ‌హించారు. శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ పాపిరెడ్డి కాల‌నీలోని ఆర్‌కే మాడ‌ల్ స్కూల్‌లోని ప‌ట్టభ‌ద్రులైన ప్రిన్సిప‌ల్ ర‌త్న‌కుమారి, భోద‌నా సిబ్బందికి అదేవిధంగా గిడ్డంగిలోని మైత్రీ మోడ‌ల్ స్కూల్ ఉపాధ్యాయుల‌‌కు క‌ర‌ప‌త్రాలు అంద‌జేశారు. ఎన్నిక‌ల్లో మొద‌టి ప్రాధాన్య‌త ఓటు సుర‌భి వాణీదేవికి వేసి పెద్ద‌ల స‌భ‌కు పంపించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్‌ యువ నాయకులు రాగం అనిరుద్ యాదవ్, కె.రమేష్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, గణపురం రవీందర్, అలి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల‌కు క‌ర‌ప‌త్రాలు అంద‌జేసి ఓటు అభ్య‌ర్థిస్తున్న రాగం సుజాతాయాద‌వ్‌, అనిరుధ్ యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here