చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠపాలిత షిరిడి సాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ షిర్డి సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ముగిసాయి. చివరిరోజు సాయిబాబాకు కాకడహారతి, అష్టోత్తర శతకళశాభిషేకం, అలంకరణ, అర్చనలు, నిత్యహోమాలు, పూర్ణాహుతి, దూప్ హారతీ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం చందానగర్ అన్నపూర్ణ పురవీధుల్లో రధోత్సవం ఉత్సాహంగా కొనసాగింది. పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. స్థానిక భక్తులు కోనేరు ప్రసాద్, లక్ష్మీ దంపతులు అన్నదాన సేవలో, వెంకటరఘునాథ చైతన్య, నాగజ్యోతి దంపతులు అల్పాహార సేవలో భాగస్వామ్యులయ్యారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ కమిటి చైర్మన్ యూవి రమణమూర్తి, సభ్యులు దాతలకు, పండితులను ఘనంగా సత్కరించారు. ఉత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సేవసమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.