చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశం ముదిరాజ్ జన్మదినం సందర్బంగా ఆయనకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశంను ఆయన సన్మానించి స్వీట్ తినిపించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు అక్బర్ ఖాన్, గురు చరణ్ దూబె పాల్గొన్నారు.







