రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధికి గంగల రాధాకృష్ణ యాదవ్ రూ.1,00,116 సమర్పణ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అయోధ్య‌లో నిర్మిత‌మ‌వుతున్న శ్రీ‌రామ భ‌వ్య మందిర నిర్మాణానికి కొండాపూర్ కు చెందిన బిజెపి సీనియ‌ర్ నాయ‌కులు, కార్పోరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి గంగల రాధాకృష్ణ యాదవ్ రూ. 1,00,116 నిధి స‌మ‌ర్ప‌ణ చేశారు. సోమ‌వారం శేరిలింగంప‌ల్లి బిజెపి నాయ‌కులు ఎం.ర‌వికుమార్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన రామ మందిర నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఎంపి ధ‌ర్మ‌పురి అర‌వింద్, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ల‌ స‌మ‌క్షంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్ర‌చార‌క్ దేవేంద‌ర్ జీ కి రాధాకృష్ణ యాదవ్ చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం ప్రతీ ఒక్క హిందువు కల అన్నారు. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ముందుకు వస్తున్నారన్నారు. మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గంగల నర్సింహ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ కి చెక్కును అందజేస్తున్న గంగల నర్సింహ యాదవ్, రాధాకృష్ణ యాదవ్ లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here