ఆల్విన్ కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): కాలనీలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి ప్రజలు, దాతలు స్వచ్చందగా ముందుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్యనగర్ లో కాలనీ అసోసియేషన్, దాతల సహకారం తో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం గాంధీ స్ధానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, దాతల విరాళాలతో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించుకోవడం చాల సంతోషకరమని తెలిపారు. ప్రజలు అందరూ కలిసి కాలనీ అభివృద్ధికి పాటు పడాలని, కాలనీ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని తెలిపారు. కాలనీ లలో ఎటువంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ , తెరాస నాయకులు రామకృష్ణ , మధు,బోయ కిషన్,కుమారి ,శిరీష కాలనీ వాసులు నాగేశ్వర్ రావు ,యాదగిరి ,రామారావు ,జంగా రెడ్డి ,జనార్దన్ ,ఆంజనేయులు ,వేణు,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు