హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో ఆమె మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు, కరెంట్ స్తంభాల తొలగింపు, మంజీరా పైప్ లైన్ లీకేజీ సమస్యను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, సంజు సాగర్, కమోజీ గౌడ్, ముజీబ్, విశ్వనాథ్, లాలూ పటేల్, ఏరియా సభ్యులు సుదేశ్, శాంతు, యూసుఫ్, రెడ్డి, ఈశ్వర్, పాషా, సయ్యద్ ఇసాక్, బాబు రావు, రాజు, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, శానిటేషన్ సురేష్ పాల్గొన్నారు.