చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథస్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా సుప్రభాత సేవ, విశేష అర్చన, బాలభోగం నివేదన, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.







