ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ హోప్ ఆధ్వ‌ర్యంలో ముగ్గుల పోటీలు

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): శేరిలింగంప‌ల్లిలోని తారాన‌గ‌ర్ తుల్జా భ‌వాని ఆల‌య ప్రాంగణంలో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ హోప్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీల‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో చైత‌న్య, విజ‌య‌ల‌క్ష్మి, స్నేహ సోలంకి అనే మ‌హిళ‌లు ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి వ‌రుస‌గా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. ఈ కార్యక్ర‌మంలో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ హోప్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్‌, ప్రధాన కార్యదర్శి మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, నూకల సందీప్, మారం ప్రసాద్, వార్డ్ కమిటీ మెంబ‌ర్ కవిత, ఆలయ కమిటీ సభ్యులు రేణుక, సంజీవ రెడ్డి, గోవిందు, స్థానికులు బాచు రాజు, బండి పాండు ముదిరాజ్, నటరాజ, సంపత్, అజయ్, సతీష్, విజయ్ పాల్గొన్నారు.

విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేసిన ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ హోప్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here