స‌గ‌రులంద‌రూ లేబ‌ర్ కార్డుల‌ను పొందాలి

  • స‌గ‌ర ఉప్ప‌ర సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఉప్ప‌రి శేఖ‌ర్ స‌గ‌ర

మీర్‌పేట‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి సగరుడు నిర్మాణ రంగ కార్మిక గుర్తింపు కార్డులు పొందాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. బుధవారం మీర్‌పేట‌లో రంగారెడ్డి జిల్లా సగర సంఘం జిల్లా అధ్యక్షుడు సురంపల్లి కృష్ణ సగర అధ్యక్షతన జరిగిన సంఘం కార్యవర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశమైన లేబర్ కార్డ్స్ ను జిల్లాలో ప్రతి సగరుడు తీసుకోవాలని శేఖ‌ర్ స‌గ‌ర‌ సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల బాలు సగర, కోశాధికారి దామోదర్ సగర, రాష్ట్ర‌ సంయుక్త కార్యదర్శి సతీష్ సగర, రాష్ట్ర‌ యువజన కార్యనిర్వహణ కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర పాల్గొన్నారు.

స‌మావేశంలో చ‌ర్చిస్తున్న స‌గ‌ర ఉప్ప‌ర సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఉప్ప‌రి శేఖ‌ర్ స‌గ‌ర‌, సంఘం నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here