చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జేవీఎన్ గార్డెన్ లో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ అధినేత గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రోజా రంగారావు, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్ లు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు ఆదర్శ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రవీణ్, సురేందర్ పాల్గొన్నారు.







