భిక్షపతి ఎనక్లేవ్ లో పర్యటించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

భిక్ష‌ప‌తి కాల‌నీలో వాసుల‌తో స‌మావేశ‌మైన‌ కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి

చందానగర్, (న‌మ‌స్తే తెలంగాణ‌): చ‌ందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని భిక్షపతి ఎనక్లేవ్ కాలనీలో ఆదివారం స్థానిక కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తారెడ్డి ప‌ర్య‌టించారు. కాలనీ లో మొత్తం సి.సి రోడ్లు, డ్రైనేజీ పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపారు. కాలనీ లో విద్యుత్ ట్రాన్స్ఫర్మ్, ఒక్క పోల్ వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నార‌ని, పక్కకు జరపాలని అదేవిధంగా నాలా కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కార్పొరేట‌ర్ ప్రతి ఆదివారం కాలనీ పర్యటనలో భాగంగా ఈ రోజు భిక్షపతి ఎనక్లేవ్ కాలనీ లో పర్యటించడం జరిగినది అని, విద్యుత్ సమస్యల గురించి విద్యుత్ అధికారులతో మాట్లాడతాన‌ని, నాలా కు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామ‌ని, ఇంకా ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. కారోనా విషయంలో కాలనీ వాసులు ఎవ్వరు కూడా భయబ్రాంతులకు గురికావద్దు అని,కారోనా వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు,కానీ తగుజాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంద‌ని, కారోనా కు మనో దైర్యమే మందు అని, ఎవరు పడితే వారు ఇచ్చే రక రకాల మందులు వాడి అనారోగ్యాల పలు కావద్దని, డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ఏడుకొండలు, మూర్తి, సత్యనారాయణ, వెంకటేశ్వర రావు, నర్సింహ రావు, జగన్నాధ రావు, రామాంజనేయులు, నాగవేణి, శోభారాణి, ఉష, జయమల, ఉమ, తదితర కాలనీ వాసులు శర్మ తదితరులు పాల్గొన్నారు.

కాల‌నీ మీదుగా పారుతున్న నాలా పూడిక తీత ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ న‌వ‌తారెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here