భారతినగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తం అందిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీకి చెందిన విక్కీ ప్రిస్కిల్ల అనే మహిళ ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాలను బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం అందజేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ ఆదుకుంటున్నదని అన్నారు. అనారోగ్యాలకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందే నిరుపేదలకు, అభాగ్యులకు సీఎం సహాయ నిధి భరోసానిస్తుందని అన్నారు.