భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారతీనగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీలో రహదారిపై బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై 15 మంది తెరాస కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. వారు తమ మహిళా కార్యకర్త నుంచి ఓటర్ జాబితాను లాక్కున్నారని, అనంతరం ఆమెను బెదిరించారని, ప్రచారం చేయనివ్వకుండా వెళ్లగొట్టేందుకు యత్నించారని అన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
