శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): యావత్ భారత జాతికే స్ఫూర్తి శిఖరం, భారత జాతి వీరయోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ అని, ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. మియపూర్ డివిజన్ పరిధిలోని శివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ శోభా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. శివాలయం నుండి తారాగర్ శ్రీ తుల్జా భవాని ఆలయం వరకు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, మల్లేష్, యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయుల సంరక్షణకి అనేక యుద్ధాలు చేసిన మహావీరుడని, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ వేరేందర్ గౌడ్, నియోజకవర్గ నాయకులు మన్నెపల్లి సాంబశివరావు, రామచందర్ గౌడ్, రవి కుమార్, రాంబాబు, నవీన్, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.