శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఎంతో మందికి ఆదర్శమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ ఛత్రపతిగా పేరుగాంచిన శివాజీ దార్శనిక నాయకుడని, నిర్భయ యోధుడని కొనియాడారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ధైర్యం, వివేకం పేరు చెబితే ఛత్రపతి శివాజీ గుర్తుకు వస్తాడని అన్నారు.