శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని PNR Empire కాంప్లెక్స్ లో Help For Cyber Victims ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బాలానగర్ ACP హన్మంతరావు, జగద్గిరి గుట్ట CI నర్సింహ, జీడిమెట్ల CI మల్లేశం, Help For Cyber Victims ఫౌండేషన్ చైర్మన్ పులి అరవింద్ కుమార్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ Help For Cyber Victims ఫౌండేషన్ సేవలు అమోఘం అని అన్నారు. సైబర్ క్రైమ్ లలో మోసపోయిన బాధితులకు సహాయం చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ కు సాంకేతిక సహాయ సహకారాలు అందించడం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. సమాజ హితం ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ వారికి కొండంత అండగా నిలవడం గొప్ప విషయం అని అన్నారు.
ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కనీస అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సంస్థ 200 కి పైగా మహిళా వేధింపుల కేసులు పరిష్కారం అయ్యేలా చేసిందన్నారు. మహిళల మిస్సింగ్ కేసులు 300, బాలికల మిస్సింగ్ కేసులు 129, మొబైల్ హ్యాకింగ్ కేసులు 652 పైగా పరిష్కారంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచిందని, ఆన్ లైన్ లో డబ్బు పోగొట్టుకోవడం, లోన్ యాప్ లు , బ్యాంక్ లావాదేవీల మోసం , అనుమానిత లొకేషన్ ట్రేసింగ్ , ఆన్ లైన్ యాప్ మోసాలు వంటి నేరాలలో సర్వం కోల్పోయిన బాధితుల పక్షాన కొండంత అండగా నిలుస్తుందన్నారు. వారికి భరోసాను ఇస్తున్న సంస్థ నిర్వహకులను ప్రత్యేకంగా అభినదిస్తున్నానని తెలియచేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, సైబర్ నేరాలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , తిరుపతి తదితరులు పాల్గొన్నారు.