స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌హిళా కాంగ్రెస్ ముఖ్య‌పాత్ర పోషించాలి: చంద్రిక ప్రసాద్ గౌడ్

శేరిలింగంపల్లి, జూన్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. నియోజకవర్గ అధ్యక్షురాలు పి.చంద్రిక ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీజ్యోతి పామేన ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 12 డివిజన్స్ లో మహిళా కాంగ్రెస్ డివిజ‌న్స్, బ్లాక్, మండల కమిటీలు పూర్తిచేసుకుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. బూత్ కమిటీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ మహిళా కాంగ్రెస్ ముందుకు వెళుతూ ఉంద‌న్నారు. రానున్న స్థానికసంస్థ ఎన్నికలలో మహిళా కాంగ్రెస్ ఒక ముఖ్య పాత్ర వహించాలని దానికి ప్రతి నెల మొదటి వారంలో జిల్లాస్థాయి ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మీటింగ్ తోపాటు నాయకత్వ శిక్షణా తరగతులు వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బ్లాక్ ఏ, బ్లాక్ బి అధ్యక్షురాళ్లు శ్రీదేవి, భాగ్యలక్ష్మీ, జిల్లా సెక్రెటరీ రాణి, డివిజన్ అధ్యక్షురాళ్లు వి.రాజ్యలక్ష్మి, విమల, కే. లక్ష్మి, శ్రీజ్యోతి, సుప్రజా, కమిటీ సభ్యులు జి.జ్యోతి, కే. సౌందర్య, వై. నాగలక్ష్మి , కరుణశ్రీ, పద్మ, గాయత్రి, కృష్ణకుమారి, విజయలక్ష్మి, మౌనిక, స్వప్న, సంధ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here